Adi Sankara, was a renowned philosopher, theologian, and spiritual leader. He was born when Hinduism as a religion was in utter chaos. The multiplicity of religious practices saw the rise of many cults all claiming to be the real Hinduism. The real Hinduism or the Sanatan Dharma was passing through a difficult phase. With Vedic tradition under attack, it was Shankaracharya’s genius that reinvented Hinduism and re-established the Vedic tradition with his excellent commentaries on Brahamasutras, Upanishads, and the Bhagavad Gita. 

It was his period that saw the re-emergence of Hinduism. The basic contribution of Shankaracharya was his brilliant explanation of Indian philosophical thought and his concept of Advait or non-dualism which tends to give a unique position to Hinduism among a pantheon of religions. 

Sankara resuscitated the glory of the Vedic tradition and formulated his philosophy on a religious and ethical basis that would satisfy the ethical demands and spiritual needs of the people, harmonize the conflicting religious sects, and establish the cultural unity of the country on a spiritual basis. 

Adi Shankaracharya’s teachings and philosophical works have had a profound influence on the development and preservation of Hindu philosophy. Born in Kerala, India, Adi Shankaracharya exhibited exceptional wisdom and intellectual prowess from an early age. He embarked on a quest for knowledge and sought to unify and revive the scattered and diverse schools of thought within Hinduism. His philosophy is primarily based on the concept of Advaita Vedanta, which asserts that the ultimate reality is non-dualistic and that the individual self (Atman) is identical to the universal consciousness (Brahman). One of Adi Shankaracharya’s significant contributions was his commentary on the ancient scriptures of Hinduism, including the Upanishads, Bhagavad Gita, and Brahma Sutras. Through his profound interpretations, he emphasized the importance of self-realization, the illusion of the material world, and the path to liberation (Moksha) from the cycle of birth and death. Adi Shankaracharya also established four monastic orders (Mathas) in different regions of India, namely Sringeri in the South, Dwaraka in the West, Puri in the East, and Joshimath in the North. These mathas served as centers of learning and spiritual practice, preserving and disseminating his teachings. Even today, these institutions play a vital role in upholding the Advaita Vedanta tradition. In addition to his philosophical and theological contributions, Adi Shankaracharya was known for engaging in debates and discussions with scholars from different philosophical backgrounds. He traveled extensively throughout India, engaging in intellectual discourse and imparting knowledge to both scholars and laypeople. He challenged other scholars and philosophers, defeating them in theological debates.  Adi Shankaracharya’s teachings emphasize the importance of knowledge, devotion, and righteous conduct in the spiritual journey. His philosophy provided a strong intellectual foundation for Hinduism and helped to unify various sects and beliefs within the religion. The legacy of Adi Shankaracharya continues to inspire millions of followers and seekers of truth worldwide. His teachings have contributed to the intellectual and spiritual growth of individuals, encouraging them to explore the depths of their own consciousness and seek the realization of their true nature. In conclusion, Adi Shankaracharya’s profound wisdom and philosophical insights have left an indelible mark on Hindu philosophy. His efforts to revive and consolidate Hindu thought have had a lasting impact, guiding generations toward spiritual awakening and understanding. Adi Shankaracharya remains an icon of knowledge, devotion, and enlightenment, revered as one of the greatest scholars and spiritual leaders in the history of India. 

Shankara worked to re-establish the lost glory of the Vedic philosophy. His contribution to Hinduism is significant as it shows us the true value of Hinduism. If one studies Shankara’s works, one would actually know that Shankara was the personality who gave new life to Hinduism in the present age of Kaliyuga. 

So, Shankara should be looked upon as a mystic and social reformer who brought out the gems of Hinduism and gave them to the masses. 

Shankara’s relevance lives on and will continue to influence generations to follow. 

శ్రుతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం 
నమామి భగవత్పాదం శంకరం లోక శంకరమ్!
సమకాలీన హిందూమత ఆలోచనా సరళిపై అత్యంత ప్రభావం చూపిన త్రిమతాచార్యుల్లో ఆది 
శంకరాచార్యులు ప్రథముడు. శంకర భగవత్పాదులుగా పిలువబడిన ఈ మహా గురువును సాక్షాత్తు 
పరమ శివుడి అవతారమని నమ్ముతారు. మత పరిస్థితులన్నింటినీ సమన్వయం చేసి భావితరాలకు జ్ఞానమార్గం చూపిన దార్శనికుడు. ‘నువ్వు వేరు… నేను వేరు’ అనే సంకుచిత మార్గం నుంచి ‘అందరమూ ఒకటే’ అన్న విశాల 
మార్గంలోకి రప్పించిన వేదాంతి. ‘జీవుడే బ్రహ్మం… బ్రహ్మమే జీవుడు ఆ ఇద్దరికీ తేడాలేదు. చుట్టూ కనిపించేదంతా మాయ మాత్రమే. అవిద్య కారణంగా ఆ మాయను 
జీవుడు గుర్తించలేకపోతున్నాడు.అజ్ఞానం నుంచి బయటపడి తనన తాను తెలుసుకోగలగాలి’ అని ఆది శంకరులు ఉద్బోధ చేశారు. 
కేరళలోని కాలడిలో ఆర్యాంబ, శివగురువు పుణ్య దంపతులకు జన్మించిన శంకరాచార్యులు
ఎనిమిదేళ్ల వయస్సులో గురువు కోసం అన్వేషిస్తూ చివరికి గోవింద భగవత్పాదుల వద్ద శిష్యరికం 
చేశారు. ఈ ప్రపంచమంతా నా కుటుంబమే అనే సిద్ధాంతాన్ని నమ్మిన ఆది శంకరాచార్య అద్వైత 
సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తూ యావద్భారతాన్ని రెండుసార్లు చుట్టి వచ్చారు. భారతీయ సంస్కృతీ సంప్రదాయాల్లోని భిన్నత్వాన్ని గ్రహించిన ఆయన, వీటి మధ్య ఏకత్వాన్ని సాధించాలని 
తలపోశారు. అందుకే దేశంలోని నాలుగు దిక్కుల్లో శృంగేరి, ద్వారక, పూరి, జ్యోతిర్మఠం పీఠాలను 
స్థాపించారు. ఇవి శంకరుల సిద్ధాంతానికి, హిందూ ధర్మానికి నలు దిక్కులా దీపస్తంభాల మాదిరిగా 
పనిచేశాయి. దేశం మొత్తం ఐక్యంగా ఉండాలన్న దూరదృష్టిని, భిన్నత్వంలో ఏకత్వాన్ని ఆనాడే 
ఆయన విశదీకరించారు. 
భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, విష్ణు సహస్ర నామాలకు శంకరులు రాసిన భాష్యాలు ఆయనను 
అనుసరించినవారికీ, విభేదించిన వారికీ కూడా మౌలిక వ్యాఖ్య గ్రంథాలుగా ఉపయోగపడ్డాయి. గురు శిష్యుల సంబంధం గురించి సనందుడు అనే శిష్యుడు ద్వారా ప్రపంచానికి తెలియజెప్పారు. 
హిందూ మతంలో పాతుకుపోయిన కుసంప్రదాయాలు, దురాచారాలను తొలగించి వైదిక మార్గంలోకి మళ్లించిన గొప్ప ధీశాలి. శంకరాచార్యులు వ్రాసిన 108 గ్రంథాల్లో గణేశ పంచరత్న స్త్రోత్రం, భజ 
గోవిందం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం, కనకధారా స్తోత్రం, శివానందలహరి, సౌందర్యలహరి వంటి అనేక రచనలు హిందువులకు నిత్య ప్రార్థనా స్తోత్రాలుగా ఉపయుక్తమయ్యాయి. 
 
శంకరుల కాలం నాటికి బౌద్ధ, జైన మతాల ప్రాబల్యం వల్ల క్షీణ దశలో ఉన్న హిందూమతానికి 
ఆయన చికిత్స ప్రారంభించారు. హిందువులు అనేక శాఖలుగా చీలిపోయి తమలో తామే 
కలహించుకునేవారు. మీమాంస, సాంఖ్య వాదులు దాదాపు దేవుడిని నమ్మకపోగా, చార్వాకులు 
వేదాలను నిరసించారు. ఆది శంకరులు వివిధ శాఖలకు చెందిన పండితులను తన వాదంతో 
ఓడించి అద్వైత సిద్ధాంతాన్ని ఒప్పించారు. భగవంతుని నమ్మేవారినందరినీ షణ్మత వ్యవస్థలో 
ఏకీకృతులను చేశారు. వేదాలకు తగిన గౌరవాన్ని తిరిగి సాధించి హిందువులలో ఆత్మవిశ్వాసాన్ని పెంచారు. దేశమంతటా తిరిగి వేద వేదాంగాలను ప్రచారం చేశారు. 
కేవలం 32 ఏళ్లు మాత్రమే జీవించిన శంకరుల ప్రభావం హిందూమతంపై అనన్యసామాన్యం. 
స్మార్తులు, సంతులు ఆయన నెలకొల్పిన సాంప్రదాయాలను ఆచరిస్తారు. దశనామి సంప్రదాయం, 
షణ్మత విధానం, పంచాయతన విధానం శంకరులు నెలకొల్పినవే. సంప్రదాయాలతో సరిసమానంగా శంకరులు స్వానుభవానికి ప్రాముఖ్యతనిచ్చారు. వ్యాకరణం, మీమాంస లాంటి అధ్యయనాలు 
వేదాంత విద్యార్థులకు ముఖ్యమైన అధ్యయన విభాగాలు. 
పరమేశ్వరుని అవతారంగా భావించే ఆది శంకరుల కృప వలననే ఈ రోజు హిందూ మతంలో స్పష్టత, 
పారదర్శకత, లోతు, ఐక్యత ఉన్నాయనడంలో అతిశయోక్తి లేదు. ఎందరో మహర్షుల, ఋషుల నోట అంతర్యామి వాక్కులుగా పలుకబడిన శక్తి వేదాలుగా 
ప్రకాశిస్తున్నాయి. ఎవరో రచించి, మరెవరో పరిశీలనం, విమర్శలు చేసేందుకు అవి పురాణాలు, 
నవలలు కావు. విశ్వవ్యాప్తుని మనోకమలం నుంచి స్వయంగా మహాపురుషుల నోట వెలువడిన 
సచ్చిదానందాలే వేదాలు. 
అలాంటి వేదాలకు కూడా వక్ర భాష్యం చెప్పి, భారతీయ సమాజంలో విభజన కలిగించి, మూఢ 
ఛాందస భావాలను ప్రేరేపించి అన్యమతాల వైపు ప్రజలను మళ్లించిన సమయంలో ఆ పరిస్థితిని 
చక్క దిద్దడానికి శంకరులు కాలడిలో శివగురు శక్తితో ఆర్యాంబ గర్భంలో ఉత్తరాయణ పుణ్య కాలం 
వైశాఖ శుద్ధ పంచమి నాడు అవతరించారు. 
మూడో యేటనే తండ్రిని కోల్పోయిన శంకరులకు ఐదేళ్లకే ఉపనయనం జరిగింది. బ్రహ్మచర్య దీక్షలో భాగంగా మధూకరం కోసం భిక్షాటనకు వెళ్లిన శంకరులకు ఇవ్వడానికి ఒక పేద ఇల్లాలుకు 
ఉసిరికాయ తప్ప ఏమీ దొరకలేదు. ఆమె దుస్థితికి కరిగిన శంకరులు లక్ష్మీదేవిని కనకధారా స్తోత్ర 
రూపంలో ప్రార్థించగా ఆ తల్లి కరుణించి ఆ ఇంట బంగారు ఉసిరికలు కురిపించి వారి పేదరికాన్ని పారద్రోలింది. 
 
తల్లి అనుమతితో సన్యాసం స్వీకరించిన శంకరులు.. ఎనిమిదేళ్ల వయసులో గురువు కోసం 
అన్వేషిస్తూ చివరికి గోవింద భగవత్పాదుల వద్ద శిష్యరికం చేశారు.